ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌తో తీవ్ర పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా.. మూడు అక్ష‌రాలే అయినా.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. ఇక ఈ మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం ప్ర‌భుత్వాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ వెనుక‌డుగు వేయ‌కుండా.. క‌రోనాతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు దేశాలు క‌రోనాకు అడ్డుక‌ట్ట వేయ‌డానికి లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు మిన‌హా.. మిగిలిన అన్ని సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. 

 

ఈ క్ర‌మంలోనే ప‌లు కంపెనీలు మూత ప‌డ‌డంతో.. ఉద్యోగులు కాస్త నిరుద్యోగులు అయ్యారు. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున సైతం ప‌డ్డాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ చెబుతూ.. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్-ICCR ఖాళీల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 32 పోస్టుల‌ను విడుద‌ల చేసింది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్, అసిస్టెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐసీసీఆర్.

 

ఇక మొత్తం 32 పోస్టులు ఉండ‌గా.. ప్రోగ్రామ్ ఆఫీసర్- 8, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్- 10, అసిస్టెంట్- 7, సీనియర్ స్టెనోగ్రాఫర్- 2జూనియర్ స్టెనోగ్రాఫర్- 2, 
లోయర్ డివిజన్ క్లర్క్- 3 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేష‌న్ ద‌ర‌ఖాస్తు 2020 మార్చి 17 నుంచి ప్రారంభ‌మైంది. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టులకు జూన్ 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.iccr.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. విద్యార్హతలు విష‌యానికి వ‌స్తే.. 10+2, డిగ్రీ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: