ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు వ్యాప్తిచెందింది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యతో ఆయా దేశ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు  కరోనా బాధితుల సంఖ్య 53లక్షలు దాటాయి. అలాగే క‌రోనా కాటుకు బ‌లైపోయిన వారి సంఖ్య‌ 3,40 ల‌క్ష‌లకు చేరుకున్నాయి. ఇక ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ ప్రకటించినా కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

 

ముఖ్యంగా  అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు కోకొల్లొల్లు. మ‌రోవైపు విద్యా సంస్థ‌లు కూడా మూత‌ప‌డి.. విద్యార్థులంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఎన్నో ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. అయితే తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరుగుతుందని పేర్కొంది. 

 

జూలై 4న ఈసెట్, జూలై 10న లాసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జూలై 13న ఐసెట్, జులై 15న ఎడ్‌సెట్‌ పరీక్షలు జరుగుతాయని వెల్ల‌డించారు. అలాగే జూలై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌, జూలై 1న పాలీసెట్‌ నిర్వహించనున్నారు. అయితే అన్ని పరీక్షలకు కూడా కరోనా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు. కాగా, జూన్ 8 నుంచి జూలై 5 వరకు మిగిలిన పది పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఇప్ప‌టికే ప్రకటించింది. మ‌రియు టెన్త్ ప‌రీక్ష‌ల మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: