ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల అనేక రంగాలు కుదేల్ అవ్వ‌డ‌మే కాకుండా.. ఎంద‌రో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ-RCB ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

 

భారత ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, యూనెస్కో ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ ఇది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 25 ఖాళీలున్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అకౌంట్స్ అసిస్టెంట్, డీఈఓ, సెక్రెటేరియల్ అసిస్టెంట్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 ఖాళీలు ఉండగా అందులో ప్రాజెక్ట్ మేనేజర్- 1, గ్రాంట్స్ అడ్వైజర్- 3, మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్)- 1, సిస్టమ్స్ అనలిస్ట్- 1, సీనియర్ లైజన్ అసిస్టెంట్- 1, సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్- 1, అకౌంట్స్ అసిస్టెంట్- 3, డేటా ఎంట్రీ ఆపరేటర్- 3, టెక్నికల్ అసిస్టెంట్ (ఐటీ అండ్ సపోర్ట్ సర్వీసెస్)- 1 ఖాళీలున్నాయి.

 

వాటితో ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్- 1, సెక్రెటేరియల్ అసిస్టెంట్- 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 2, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ (సీఎస్ఓ)- 1, చీఫ్ సైంటిస్ట్ (బయో ఫార్మా)- 1, మేనేజర్ (అడ్మిన్ అండ్ ఫైనాన్స్)- 1, సైంటిస్ట్ (టాక్సికాలజీ)- 1, సైంటిస్ట్ (ఫార్మా బయోటెక్నాలజీ)- 1, సైంటిస్ట్ (మైక్రో బయాలజీ)- 1 పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మరిన్ని వివరాల కోసం https://www.rcb.res.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. ఇక ఈ పోస్టుల‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు 2020 మే 29 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: