ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్  కరాళ నృత్యం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలు అత‌లా కుత‌లం అవుతున్నాయి.  ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. ప్ర‌స్తుతం ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. దీనిని క‌ట్ట‌డి చేయడం ప్ర‌భుత్వాల‌కు మ‌రింత పెద్ద స‌వాల్ మారింది. ఇక మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌తో ఆర్థికంగా ఎంద‌రో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఉద్యోగాలు సైతం పోతున్నాయి. 

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB కోసం గతంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 93 ఖాళీలు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టీఎస్‌పీఎస్‌సీ. మొత్తం 93 ఖాళీలు ఉండగా అందులో మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 79, మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్)- 06, మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04, మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03, మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01 పోస్టులున్నాయి. 

 

విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇక ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 2020 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్ల లోపు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఇక పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌ది తేది 2020 మే 31. అంటే మ‌రో మూడు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేష‌న్ పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: