ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు దాదాపు రెండు నెలల తర్వాత ఏపీకి వచ్చారు. ఆయన రావడం కోసం కూడా చాలా పెద్ద కసరత్తు జరిగింది. హైదరాబాద్ లో ఉన్న ఆయన ఆంధ్ర, తెలంగాణ డీజీపీలకు ఉత్తరాలు రాసి మరీ అమరావతి వచ్చేందుకు పర్మిషన్ తీసుకున్నారు. మొత్తానికి రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఏపీలో రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

ఆ మరుసటి రోజే హైదరాబాద్ ప్రయాణం అయ్యారు. చంద్రబాబు హైదరాబాద్ ప్రయాణం సంగతి తెలుసుకుని తెలుగు తమ్ముళ్లు కాస్త ఆశ్చర్యపోయారు. రెండు నెలల తర్వాత వచ్చి రెండు రోజులు కూడా పూర్తిగా ఉండకపోవడమేంటని వారు ముక్కున వేలేసుకున్నారు. అసలు ఈ రెండు రోజుల కోసం చంద్రబాబు ఎందుకు పర్మిషన్ తీసుకుని మరీ అమరావతి వచ్చినట్టు అని చర్చించుకున్నారు.

 

 

అమరావతి వచ్చిన చంద్రబాబు కేవలం మహానాడు కార్యక్రమంలోనే పాల్గొన్నారు. అంతకు మించి జనంలోకి ఎక్కడా వెళ్లలేదు. మహానాడు తర్వాత విశాఖ వెళ్లి ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తారని అంతా అనుకున్నా.. ఆ పని చేయలేదు. మహానాడు పూర్తయిన మరుసటి రోజే హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో వెళ్లిపోయారు. ఇందంతా చూసిన వారు అసలు ఇంతకీ చంద్రబాబు ఎందుకు అమరావతికి వచ్చారా అని ఆలోచిస్తున్నారు.

 

 

మహానాడు కోసం అని అనుకుందామంటే.. అది ఎలాగూ జూమ్ యాప్ ద్వారా నిర్వించిన సమావేశమే. ఆ మాత్రం జూమ్ సమావేశం హైదరాబాద్ లో ఉండి కూడా నిర్వహించవచ్చు. అందులోనూ హైదరాబాద్‌లో మంగళగిరి కంటే పెద్ద ఆఫీసు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఉండనే ఉంది. అందుకే.. బాబూ.. ఆ మాత్రం జూమ్ మీటింగ్‌కు అమరావతి అయితేనేం..? హైదరాబాద్ అయితేనేం..? అని ప్రశ్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: