ఆరోగ్య రంగంపై దృష్టి సారించిన ఏపీ సీఎం వైఎస్ జగన్... ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై దృష్టి సారించారు. ఏకంగా 9 వేల మందికిపై నియమించాలన్న నిర్ణయంతో త్వరలో నోటిఫికేషన్ తీసుకురాబోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది లేకపోతే ఎంతచేసినా లాభం లేకుండా పోతుంది. అందుకే ఏయే ఆస్పత్రికి ఎంతమంది అవసరం అని.. జాతీయ ప్రమాణాలు ఐపీహెచ్‌ఎస్‌ ప్రకారం ఎంతమంది కావాలో వారందరినీ రిక్రూట్‌ చేసుకోవాలని జగన్ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేశారు.

 

 

దీని ప్రకారం.. అని ఆరోగ్య శాఖకు ఆదేశాలిచ్చాం. 9,712 మంది డాక్టర్లు, నర్సులు, ఇతర ఇబ్బందిని రిక్రూట్‌ చేసుకునేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది. మరో వారంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ రాబోతోంది. నెలన్నర రోజుల్లో 9,712 మంది కొత్త ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. అంతే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత కూడా తీర్చేస్తున్నారు. మెడిసిన్‌ సంఖ్య ఇంతకు ముందు గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో 230 ఉంటే.. దాన్ని 500 సంఖ్యకు పెంచారు.

 

 

అంతేకాకుండా మెడిసిన్‌ డబ్లూహెచ్‌ఓ, జీఎంపీ అంటే గుడ్‌ మెడికల్‌ ప్రాక్టీసెస్‌ స్థాయి ఉన్న మెడిసిన్‌ మాత్రమే ఆస్పత్రుల్లో ఉంచుతున్నారు. అందుకే.. నేను గర్వంగా చెప్పగలుగుతా.. ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాగాలేకపోయినా.. మన గవర్నమెంట్‌ ఆస్పత్రులకు వస్తే మంచి మందులు దొరుకుతాయని గర్వంగా చెప్పే పరిస్థితిలో మన ఆరోగ్యశ్రీలో ఉంది అని జగన్ గర్వంగా చెబుతున్నారు. త్వరలో ప్రాంతీయ డ్రగ్‌స్టోరేజ్‌ వ్యవస్థను కూడా తీసుకువచ్చేందుకు నిధులు మంజూరు చేశారు.

 

 

అంతే కాదు.. 52 ఏరియా ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకోసం రూ.695 కోట్లతో టెండర్లకు సిద్ధం చేశారు. 169 సీహెచ్‌సీ ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నారు. ఇందుకు రూ.541 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. మరో 15 రోజుల్లో టెండర్లు పిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: