ఇంజరీనింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ విద్యార్ధులకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థ నుంచీ భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించింది.అందుకు తగ్గట్టుగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.అంతేకాదు ఈ నోటిఫికేషన్ కి అనుగుణంగా మరిన్ని ఖాళీలు ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లో ఉద్యోగాలని అనుసంధానం చేస్తున్నట్టుగా ప్రకటించింది. దాంతో పాత నోటిఫికేషన్ లో ఉద్యోగాలతో కలుపుకుని 118 ఉద్యోగాలని ప్రకటించింది...అయితే
తాజాగా మరిన్ని పోస్టులని ఈ నోటిఫికేషన్ లో కలిపింది. కొత్తగా 126 పోస్టులని కలుపుతూ మొత్తం పోస్టులని 311 కి పెంచింది. ఈ ఉద్యోగాలని భర్తీ చేసే ప్రక్రియని మొదలు పెట్టింది. అందుకుగాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పిటికే దరఖాస్తు ప్రక్రియ మొదలు అయ్యింది. ఈ ప్రకటనతో నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరిన్ని పోస్టులు కలవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం ఖాళీలు : 311
ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ : 81
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ : 60
మెకానికల్ ఇంజనీరింగ్ : 82
ఎలక్రికల్ ఇంజనీరింగ్ : 12
మేటల్లార్జీ : 10
ఫిజిక్స్ : 14
కెమిస్ట్రీ : 7
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ : 17
కెమికల్ ఇంజనీరింగ్ : 11
మ్యాధమెటిక్స్ : 4
సివిల్ ఇంజనీరింగ్ : 3
సైకాలజీ : 10
విద్యార్హత : సంభందిత ఉద్యోగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యి ఉండాలి. నెట్ స్కోర్ కూడా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ లో దరఖాస్తులు ప్రారంభ తేదీ : 29-05-2020
దరఖాస్తు చివరి తేదీ : 10 -07 -2020
దరఖాస్తు ఫీజు : రూ.100/- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకి , మహిళలకి ఫీజు లేదు.
ముఖ్యమైన లింకులు
https://rac.gov.in/download/advt_137.pdf
https://rac.gov.in/index.php?lang=en&id=0