ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను క‌రోనా ఏ రేంజ్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క‌ర వైర‌స్ దేశ‌దేశాలు విస్త‌రించ‌డంతో పాటు ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంటోంది. దీంతో క‌రోనా అన్న పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే 213 దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న క‌రోనా.. ఉద్యోగుల‌పై సైతం తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో.. అప్పుల భారం త‌ట్టుకోలేక కొన్ని కంపెనీలు జీతాలు తగ్గిస్తుండగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగుల‌ను పీకేస్తున్నారు.

 

అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా టెక్నీషియన్ల నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇవి ఏడాది అప్రెంటీస్‌షిప్ పోస్టులు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://hal-india.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పలు విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక ఈ పోస్టులకు 2020 జూన్ 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 23 చివరి తేదీ.

 

భర్తీ చేసే బ్రాంచ్‌లు విష‌యానికి వ‌స్తే.. ఏరోనాటికల్ / ఏరోస్పేస్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటల్లార్జీ / ఇండస్ట్రియల్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, కంప్యూటర్ / కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నికల్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ / ఏవియానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ / ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ / టెలీకమ్యూనికేషన్స్‌లో పోస్టులు భ‌ర్తీ చేస్తోంది. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. సంబంధిత విభాగంలో డిప్లొమానోటిఫికేషన్ కోసం https://hal-india.co.in/Common/Uploads/Resumes/1251_CareerPDF1_Notification%20for%20Diploma%202020%20Intake.pdf ఇక్క‌డ తెలుసుకోండి. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: