గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం  ప్రపంచ దేశాలన్నింటిని చుట్టేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు వైరస్ దెబ్బ‌కు విలవిల్లాడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ విధించినా.. కరోనా కేసుల పెరుగుదలలో ఏ మాత్రం తగ్గుదల లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు మానవాళి మనుగడకు సవాల్ విసురుతోంది. అదే సమయంలో కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార సంస్థలూ కుదేలయ్యాయి. 

 

ఈ క్ర‌మంలోనే నష్టాలను పూడ్చుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఉద్యోగుల జీతాల్లో కోత పెట్ట‌డంతో పాటు.. ఉద్యోగులను సైతం తొలిగిస్తున్నాయి. దీంతో వారు చివ‌ర‌కు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారెంటైన్ అండ్ స్టోరేజీ. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారెంటైన్ అండ్ స్టోరేజీ విభాగం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 175 ఖాళీలున్నాయి.

 

టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. ఎంఎస్సీ ఎంటమాలజీ, ఎంఎస్సీ నెర్మటాలజీ, ఎంఎస్సీ జూవాలజీ, ఎంఎస్సీ ప్లాంట్ ప్యాథాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ అగ్రికల్చర్. అలాగే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వయస్సు.. పురుషులకు 35 ఏళ్లు, మహిళలు, థర్డ్ జెండర్‌కు 40 ఏళ్లు ఉండాలి. మ‌రియు ఈ ఉద్యోగాల‌కు వేతనం రూ.37,000 గా నిర్ణ‌యించారు. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2020 జూన్ 12న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://ppqs.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: