ఐఓసిఎల్ ( ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ ) నిరుద్యోగులకి ఓ గుడ్ న్యూస్ తెలిపింది. తమ సంస్థ ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మొత్తం రెండు  నోటిఫికేషన్ లు విడుదల చేసింది. మొదటి నోటిఫికేషన్ లో 600 ల పోస్టులు..రెండవ నోటిఫికేషన్ ద్వారా 404 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. వాస్తవానికి గతంలోనో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ కరోనా కారణంగా సదరు నోటిఫికేషన్ పెండింగ్ లో పడటంతో తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది.

IHG

600 పోస్టులతో కూడిన మొదటి నోటిఫికేషన్ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ మొదలయ్యింది. ఈ పోస్టులకి దరఖాస్తు చేయడానికి జూన్ 21 వరకూ గడువు ఉంది. అయితే ఫిబ్రవరి 22 మార్చి 20 మధ్యలో ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసిన వారు మళ్ళీ అప్ప్లై చేయవలసిన అవసరం లేదని తెలిపింది. మహారాష్ర , గుజరాత్, మధ్యప్రదేశ్ చతీస్గడ్ , గోవా లలో ఉన్న యూనిట్స్ లలో అభ్యర్ధులని నియమించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు రాష్టాలలో ఖాళీలని భర్తీ చేయనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలని పరిశీలిస్తే.

 

ఉద్యోగ వివరాలు

మికానికల్

ఎలక్ట్రికల్

సివిల్

టెక్నీషియన్ అప్రంటీస్

ఫిట్టర్

ఎలక్ట్రీషియన్

మేషినిస్ట్

 

రాత పరీక్ష విడుదల, అడ్మిట్ కార్డ్ మొదలగు విషయాలు త్వరలో వెల్లడించనుందని తెలుస్తోంది. అధికారిక వెబ్ సైట్  https://www.iocl.com/  లో వివరాలు తెలుసుకోవచ్చు. ఇదిలాఉంటే మరొక నోటిఫికేషన్ ద్వారా 404 ఉద్యోగాలని భర్తీ చేస్తోంది. ఇందులో టెక్నీషియన్  అప్రంటీస్ట్రేడ్ అప్రంటీస్ ట్రేడ్ అప్రంటీస్ ( అకౌంట్స్ )

పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి జూన్ 18 ఆఖరు తేదీ.  ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసే అభ్యర్ధులు పలు రాష్ట్రాలలో నియమించబడుతారు.

 

 

  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: