ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశ‌దేశాల‌ను పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ ఎప్పుడు వ‌దులుతుందా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. కాని, క‌రోనా రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. వ్యాక్సిన్‌ లేని ఈ వైరస్ ను కంట్రోల్ చేయటం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఇక కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఉద్యోగుల‌పై కూడా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్-TIMS లో ఖాళీల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-MHSRB నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ / ఐపీ, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 499 ఖాళీలు ఉండ‌గా.. అందులో ప్రొఫెసర్- 14, అసోసియేట్ ప్రొఫెసర్- 24, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 48, సివిల్ అసిస్టెంట్ సర్జన్- 129, నర్సింగ్ సూపరింటెండెంట్- 1, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్- 20, స్టాఫ్ నర్స్- 246, డైటీషియన్- 1, బయో మెడికల్ ఇంజనీర్- 1, ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ / ఐపీ- 2, ఫార్మాసిస్ట్- 12 మ‌రియు మెడికల్ రికార్డ్ ఆఫీసర్- 1 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలు విష‌యానికి వ‌స్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 16న అంటే ఈ రోజు నుంచే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూన్ 19 చివరి తేదీ. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: