ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను క‌రోనా ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కోర‌ల్లో నుంచి ప్ర‌పంచ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా వ‌దిలిపెట్ట‌డం లేదు. దీంతో కంటికి కనిపించని క‌రోనా భూతం.. మానవాళికి ఇప్పుడు పెద్ద గండంగా మారింది. క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున ప‌డుతున్నారు. అయితే క‌రోనా క‌ష్ట‌కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త అందింది.

 

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్‌ చేసింది.  ఇప్పటికే సదరన్ రీజియన్‌లో కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చెరీలో 119 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసింది. ఈ తాజా నోటిఫికేష‌న్‌లో తెలంగాణ మ‌రియు ఆంధ్రప్రదేశ్‌లో 67 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్, ఎగ్జిక్యూటీవ్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ వంటి పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న అంటే నిన్న‌టి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 5 చివరి తేదీ.

 

ఇక ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 67 ఖాళీలు ఉండ‌గా.. అందులో అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 4, ఎగ్జిక్యూటీవ్ (హ్యూమన్ రీసోర్స్)- 3, గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5, గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 8డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 26 మ‌రియు ఐటీఐ ఎలక్ట్రికల్- 16 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా ఉండాలి.  ఇక  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.powergridindia.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. ఏదేమైనా క‌రోనా క‌ష్ట‌కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవ‌కాశం. కాబ‌ట్టి.. ఈ ఛాన్స్‌ను అస్స‌లు మిస్ అవ్వ‌కండి.

మరింత సమాచారం తెలుసుకోండి: