తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యాయి.  ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుద‌ల చేశారు. వాస్త‌వానికి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఎప్పుడో పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. ఈ క్ర‌మంలోనే నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.

 

అయితే ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే తమను సంప్రదించొచ్చని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేకంగా 'టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ గ్రీవియెన్స్ రిడ్రసల్ సిస్టమ్-BIGRS' ఏర్పాటు చేశారు. http://bigrs.telangana.gov.in/ పేరుతో వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. BIGRS ఆండ్రాయిడ్ యాప్ కూడా గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. ఇంటర్ ఫలితాలపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా ఈ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకొని కంప్లైంట్స్ చేస్తే.. మీ కంప్లైంట్ ఇంటర్ బోర్డు అధికారులకు వెళ్తుంది. 

 

అప్పుడు మీ సమస్య పరిష్కారమైందో లేదో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చ‌ని అధికారులు వెల్లడించారు. కాగా, గతేడాది ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట రోజుల తరబడి ధర్నాలు కూడా చేశారు. ఈ క్ర‌మంలోనే ఇంటర్ బోర్డు తీరు కూడా వివాదాస్పదమైంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, మార్చి 4 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్ సెంకండియర్‌లో 2,83,462 మంది పాస్ అయ్యారు. అయితే వారిలో బాలికలు హవా చూపారు. బాలికలు హవా 75.15 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా.. బాలురు 62.10 శాతం పాస్ అయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: