ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని క‌రోనా దెబ్బ‌కు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. రోజుల తరబడి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నా.. ఆ ప్రాణాంతక వైరస్‌కు అడ్డుకట్ట పడక‌పోగా..  మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇదే స‌మ‌యంలో కంటికి కనిపించని కరోనా దెబ్బకు అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఎంద‌రో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇంటర్ పాసైనవారికి శుభవార్త. ఇంటర్మీడియట్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 256 ఖాళీలను ప్రకటించింది ఐఏఎఫ్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్-టెక్నికల్) పోస్టుల్ని భర్తీ చేయనుంది.  పెళ్లికాని యువతీయువకులే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు  ప్రక్రియ 2020 జూన్ 15 నుంచే ప్రారంభమైంది. దరఖాస్తుకు జూలై 14 చివరి తేదీ. ఇక ఈ నోటిఫికేష‌న్లో మొత్తం 256 ఖాళీలు ఉండ‌గా.. అందులో ఫ్లయింగ్ బ్రాంచ్- 74,గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)- 105, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)- 55 మ‌రియు మెటరాలజీ- 22 పోస్టులు ఉన్నాయి.

 

విద్యార్హత విష‌యానికి వ‌స్తే ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివ‌రాల‌ను వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.  అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్-IAF. ఎంపికైనవారికి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో గల ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వనుంది. అలాగే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే రూ.250 దరఖాస్తు ఫీజు చ‌ల్లించాలి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://afcat.cdac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: