గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూన్ 23వ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీ కోసం..

ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌లు

1966: హైదరాబాదులో జవహర్ బాలభవన్ స్థాపించబడింది.
1985: ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబో జెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వలన 329 మంది మరణించారు.
2007: అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగింది.

జననాలు

1896: రట్టిహళ్లి నాగేంద్రరావు, కన్నడ, తెలుగు, తమిళ నటుడు (మ. 1977).
1907: జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.1995).
1923: దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు (మ.1986).
1935: నాదెండ్ల భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
1940: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994)
1953: జాస్తి చలమేశ్వర్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి.
1980: రాంనరేష్ శర్వాన్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

మరణాలు

1761: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా (జ.1720).
1836: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వ వేత్త. (జ.1773)
1937: కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. (జ.1907)
1964: చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (జ.1887)
1980: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (జ.1894)
1985: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922)
1993: మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (జ.1924)

పండుగలు , జాతీయ దినాలు
ప్రపంచ క్రీడాకారుల దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: