ప్ర‌స్తుతం క‌రోనా కోర‌ల్లో ప్ర‌పంచ‌దేశాలు చిక్కుకుని అల్లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా దేశ‌దేశాల ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌డం లేదు. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు ఎంద‌రో ఉద్యోగులు.. నిరుద్యోగులుగా మారుతున్నారు. క‌రోనా కార‌ణంగా దెబ్బ‌తిన్న ప‌లు కంపెనీలు ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు త‌మ ఉద్యోగుల‌ను పీకిపారేస్తున్నారు.

 

అయితే ఇలాంటి స‌మ‌యంలో కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 2167 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.  బిజినెస్ రిప్రజెంటేటీవ్, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. మొత్తం 2167 ఖాళీలు ఉండగా అందులో బిజినెస్ రిప్రజెంటేటీవ్- 1036, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- 996, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 36, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- 99 పోస్టులున్నాయి. 

 

 వేర్వేరు పోస్టులకు 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్ లాంటి అర్హతలున్నాయి.  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వేతనాల విష‌యానికి వ‌స్తే బిజినెస్ రిప్రజెంటేటీవ్- రూ.16,680, అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- రూ.20,500, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- రూ.45,000, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్- రూ.38,000 గా నిర్ణ‌యించారు. ఇక ఈ పోస్టుల‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cagdi.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 25 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇలాంటి మంచి అవ‌కాశాన్ని మిస్ చేసుకోకుండా.. అస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అంతేకాకుండా.. 2020 మే 24 నాటికి 28 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: