ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ‌దేశాలు అల్లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశ‌దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మ‌రోవైపు కంటికి కనిపించని కరోనా కార‌ణంగా అన్నిరంగాలు విలవిలలాడిపోతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో  నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్-NFL ఉద్యోగాల భర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 52 ఖాళీల‌ను ప్ర‌క‌టించింది. ఇంజనీర్, మేనేజర్, సీనియర్ కెమిస్ట్ లాంటి పోస్టులున్నాయి. వాటి వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే.. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 52 ఖాళీలు ఉండగా అందులో ఇంజనీర్ (ప్రొడక్షన్)- 1, మేనేజర్ (ప్రొడక్షన్)- 16, ఇంజనీర్ (మెకానికల్)- 5, మేనేజర్ (మెకానికల్)- 12, ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 3, మేనేజర్ (ఎలక్ట్రికల్)- 2, ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 5, ఇంజనీర్ (సివిల్)- 1, సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్)- 6, ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ)- 1 పోస్టులున్నాయి.

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ లాంటి విభాగాల్లో బీటెక్, బీఈ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు.  ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ 2020 జూన్ 30 అంటే మ‌రో మూడు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. రూ.700 ఫీజు చ‌ల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, డిపార్ట్‌మెంట్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈ నోటిఫికేష‌న్ పూర్తి వివరాలను https://www.nationalfertilizers.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. విద్యార్హతల వివరాల కోసం కూడా ఈ నోటిఫికేషన్‌లో చెక్ చేయ‌డ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: