ముఖ్య సంఘటనలు

1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు..

జననాలు

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.


ముళ్ళపూడి వెంకటరమణ (జూన్ 28, 1931 - ఫిబ్రవరి 24, 2011) తన హాస్య రచనలకు ప్రసిద్ధుడయ్యాడు. పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది. బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నాడు.

1935: ఆచంట వెంకటరత్నం నాయుడు, నాటక రచయిత (మ.2015)
1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత.
1985: పరవస్తు నాగసాయి సూరి, పాత్రికేయుడు

మరణాలు

1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1751).
1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (జ.1901)
1964: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899)
2019: అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి (జ.1933)


జాతీయ దినాలు

పేదల దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: