గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూన్ 29వ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

ముఖ్య సంఘటనలు

1757: రాబర్ట్ క్లైవ్ ముర్షీదాబాద్ లో ప్రవేశించి మీర్ జాఫర్ ను బెంగాల్, బీహార్, అస్సాం లకు నవాబుగా ప్రకటించాడు.
1914: ఆస్టరాయిడ్ # 791 (పేరు 'అని') ని జి.న్యూజ్ మిన్ కనుగొన్న రోజు.
1922: ఆస్టరాయిడ్ # 979 (పేరు 'ఇల్సెవా') ని కె. రీన్ ముత్ కనుగొన్నాడు.
1927: అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదటి సారిగా విమానం హవాయి చేరినది.

 

జననాలు

1858: జార్జి వాషింగ్టన్ గోఎథల్స్, పనామా కాలువను కట్టిన ఇంజినీరు. (మ.1928)
1864: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924) అశుతోష్ ముఖర్జీ  గణితం, సైన్సు, న్యాయశాస్త్రం లాంటి పలు రంగాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త కూడా ప్ర‌సిద్ధి పొందారు.
1879: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950)
1893: పి.సి.మహలనోబిస్, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972). ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ (1893 జూన్ 29 - 1972 జూన్ 28) భారతీయ శాస్త్రవేత్త, అనువర్తిత గణాంకశాస్త్రవేత్త. భారత ప్రణాళిక వ్యవస్థకు పితామహుడు జవహర్ లాల్ నెహ్రూ అయితే, భారత ప్రణాళిక పథానికి పి.సి.మహలనోబిస్ నిర్దేశకుడిగా ప్రసిద్ధిచెందినాడు. అతను గణాంక కొలత అయిన "మహలనోబిస్ డిస్టెన్స్" ద్వారా గుర్తింపబడ్డాడు. అతను భారతదేశ మొదటి ప్లానింగ్ కమీషన్లో సభ్యుడు. అతను ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించాడు. 
1965: రోజా రమణి బోయపాటి, రచయిత్రి, ఉపాధ్యాయిని.

 

మరణాలు

1998: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1911)

జాతీయ దినాలు
గణాంక దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: