ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ విజయవాడ నుండి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి వివిధ పోస్టులకు అప్లికేషన్లు కోరుతున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు ప్రకటన జారీ చేశారు. ఇక ఇందులో స్టాఫ్ నర్సు 28 పోస్ట్లు, అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 పోస్ట్లు, ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ భర్తీ చేయబోతున్నారు.

 

IHG


ఇక ఇందులో స్టాఫ్ నర్స్ కు ఇంటర్ మరియు gnn లేదా బిఎస్సి నర్సింగ్ హోమ్ ఏదైనా ప్రభుత్వ ఆమోదం పొందిన నర్సింగ్ కళాశాలలో పట్టా పొందిన వారు అర్హులు. వీరికి నెలకు 34000 రూపాయలు జీతంగా ఇవ్వనున్నారు. అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 పోస్ట్ గాను ఇంటర్ మరియు ఫార్మసీలో డిప్లమా చదివిన వారికి అర్హత కల్పించారు. వీరికి 28000 జీతంగా ఇవ్వనున్నారు. ఇక అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఒక్క పోస్టుకు ఇంటర్ మరియు dmlt లేదా bsc mlt కోర్సులు చదివిన వారు అర్హులు. వీరికి కూడా 28 వేల రూపాయలు జీతంగా అందుకోనున్నారు. 

 

IHG

 

 

ఇక వీటికి సంబంధించి పూర్తి వివరాలను జూలై ఆరో తారీకు సాయంత్రం ఐదు గంటల సమయానికల్లా ది డిస్టిక్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా కు చేరేలా చూసుకోవాలి. ఇక ఎందుకోసం https://krishna.ap.gov.in/  ఈ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు https://cdn.s3waas.gov.in/s3c399862d3b9d6b76c8436e924a68c45b/uploads/2020/06/2020062920.pdf  లింకును క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: