ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప్రస్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మ‌రెంద‌రో ఈ వ్యాధి బారినప‌డి నానా ఇబ్బందులో ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం కరోనా శ‌ర‌వేగంగా వ్యాప్తిచెందుతూ మానవాళికి ముప్పుగా మారింది. అయితే మ‌రోవైపు కరోనా కార‌ణంగా అన్నిరంగాలు కుదేల్ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో కంపెనీలు న‌ష్టాల‌ను త‌ట్టుకోలేక శాశ్వ‌తంగా మూత‌ప‌డ్డాయి.

 

దీంతో ఎంద‌రో ఉద్యోగులు రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో  పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-PGCIL ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 67 ఖాళీలను ప్రకటించింది.  అసిస్టెంట్, ఎగ్జిక్యూటీవ్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వాటి వివ‌రాలు చూస్తే.. మొత్తం 67 ఖాళీలు ఉండగా అందులో అసిస్టెంట్ (హ్యూమన్ రీసోర్స్)- 4, ఎగ్జిక్యూటీవ్ (హ్యూమన్ రీసోర్స్)- 3, గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు గ్రాడ్యుయేట్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 8, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్- 5, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 26, ఐటీఐ ఎలక్ట్రికల్- 16 పోస్టులు ఉన్నాయి.  వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 15న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 5 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.powergridindia.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: