గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 4వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు....


1892: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండు సార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది.
1946: ఫిలిప్పైన్స్కు అమెరికా నుండి స్వతంత్రం.
1947: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.
1976: పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడి చేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు.


జననాలు

 

1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్. (మ.1866)
1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (మ.1882)
1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు. (మ.1950)
1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1924)
1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)
1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (మ.1970)
1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
1921: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత
1927: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)
1927: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017)
1933: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు.
1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004)
1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.
1941: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (మ.2017)
1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
1961: జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.


మరణాలు


1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1743)
1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1902: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (జ.1863)
1910: జియోవాన్ని షాపరెల్లీ, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారుడు.
1934: మేరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)
1936: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (జ.1856)
1946: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)
1963: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
1969: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (జ.1892)
1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.
2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.


పండుగలు , జాతీయ దినాలు


అంతర్జాతీయ సహకార దినోత్సవం (జూలై మొదటి శనివారం)

మరింత సమాచారం తెలుసుకోండి: