ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ కంటికి క‌నిపించ‌కుండానే అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌పంచ‌దేశాలు క‌రోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాయి. అయితే మ‌రోవైపు ఈ క‌రోనా కార‌ణంగా ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటూ రోడ్డున ప‌డుతున్నారు.

 

క‌రోనా కార‌ణంగా న‌ష్టాన్ని ఎదుర్కొంటున్న ప‌లు కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ఇంటికి సాగ‌నంపుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో నిరుద్యోగుల‌కు.. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త అందింది. భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల‌కు భ‌ర్తీ చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్‌లో 147 ఖాళీలను ప్ర‌క‌టించింది. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులు ఉన్నాయి.

 

వాటి వివ‌రాలు చూస్తే.. మొత్తం ఖాళీలు 147 ఉండ‌గా.. అందులో జనరల్- 80, లీగల్- 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22, ఇంజనీరింగ్- 5, రీసెర్చ్- 5 మ‌రియు
అఫీషియల్ లాంగ్వేజ్- 1 పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల‌కు ఎంపికా విధానం ఉంటుంది. 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను. 

 

అలాగే ఈ పోస్టుల‌కు అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000 ఫీజు చ‌ల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100 ఫీజు చ‌ల్లిస్తే స‌రిపోతుంది. ఇక ఈ పోస్టుల‌కు ద‌రఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 జూలై 31 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: