ప్రఖ్యాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఐఐఎస్‌సీఐఐఎస్‌సీ బెంగళూరు 85 అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హత ఉంటె చాలు పోటీ పడవచ్చు. గ్రాడ్యుయేట్స్ సంపాదించిన  డిగ్రీ మార్కులు, ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలో కనపరిచిన ప్రతిభతో ఈ ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ పోస్టులో జాయిన్ అయిన మొదటి నెల నుండే సుమారు రూ.33,000 జీతం పొందవచ్చు. యూనివర్సిటీకి  సంబంధించిన  రోజువారీ వ్యవహారాల్లో పాలుపంచుకోవడం వీరి విధి.

దీనిపై ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. వీటితోపాటు తమ ‌అకాడమిక్ సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్ లో అప్‌లోడ్‌ చేయాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు సంబంధించి వివరాలు ఇలా..
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400
దరఖాస్తుకు చివరితేది: నవంబరు 7, 2020
వెబ్‌సైట్‌:https://www.iisc.ac.in/


మొత్తం భర్తీలు 85  ఉన్నాయి. దీనికి కావాల్సిన అర్హతలు .. 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ అప్లికేషన్‌ లో పరిజ్ఞానం ఉండాలి. వయసు వయో పరిమితి విషయానికి వస్తే నవంబరు 7, 2020 నాటికి 26 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయితే అయిదేళ్లు,దివ్యాంగులకు పదేళ్లు ఇవ్వగా, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఇచ్చారు. బ్యాచిలర్‌ డిగ్రీలో సాధించిన మార్కులు ఆధారంగా ఇంకా ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆప్టిట్యూడ్‌ పరీక్షకు 80 శాతం, అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటాది.


అర్హత పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్‌  తరహాలోనే  ఉంటుంది. పరీక్ష వ్యవధి 1.30 గంటలు.ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఎలా ఉంటుందో.. విభాగాల వారీగా  సిలబస్ పూర్తి వివరాలను ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు.అభ్యర్థులు వాటిపై దృష్టి పెడితే సరిపోతుంది. ఇప్పటికే బ్యాంకు, రైల్వే వంటి అనేక పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులు  ఈ పరీక్షలో సులభంగా ఉతీర్ణత సాధించవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: