తెలంగాణ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల రోజులు ఈ విషయం పై చర్చలు జరిపిన తెరాస సర్కార్ ఒక నిర్ణయానికి వచ్చి వివిధ శాఖలకు సబంధించిన పరీక్షలను నిర్వహించింది. ఈ మేరకు తెలంగాణ బీఈడీ పరీక్షలను కూడా ఈ మధ్య నిర్వహించింది. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఇటీవల అక్టోబర్ 1,3 వ తేదీలలో టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు వాటి ఫలితాలను విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచనకు చేసింది.భారీ వర్షాల కారణంగా ఈ నెల 21న ప్రకటించాల్సిన ఫలితాలను.. 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కన్వీనర్ ప్రొఫసర్ మృణాళిని తాజాగా వెల్లడించారు.


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీఈడీ కాలేజీల్లో 20వేల సీట్లు ఉండగా.. 30వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు.ఇందులో ర్యాంక్ పొందిన వాళ్ళు రెండేళ్ల కాలవ్యవధి కలిగిన బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. బీఈడీ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో టీచర్ పోస్టుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది..  మన దగ్గర ఉన్న విద్యను పది మందికి అందించే గౌరవ పదవి అధ్యాపక వృత్తి అని అన్నారు.



ఈ పదవిలో ఉన్న పవర్ ఎవరికీ ఉండదు.. మొక్కగా ఉన్న విద్యార్థిని మానుగా , మహా వృక్షంగా మార్చే ప్రయత్నం ఒక్క టీచర్ మాత్రమే చేయగలరు అంటూ ఆమె చెప్పుకొచ్చారు.ఆ వృత్తిని పొందాలంటే బీఈడీ కోర్సు సరైన మార్గం అంటూ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. టీఎస్ ఎడ్‌సెట్ .. ఈ సంవత్సరానికి బీఈడీ కళాశాలలో ప్రవేశం కోసం  ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించింది.. ఈ పరీక్ష ఫలితాలను అక్టోబర్ 28 న విడుదల కానున్నాయి. https://edcet.tsche.ac.in/ ఈ లింక్ లో డైరెక్ట్ చూసుకోవచ్చునని  తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: