కరోనా ప్రభావం చాలా వరకు తగ్గడం ఇప్పుడిప్పుడే అన్నీ సంస్థలు తెరుచుకున్నాయి.. ఈ మేరకు గత ఏడాది లో ఆగిపోయిన విద్యా పరీక్షలు అన్నీ కూడా ఈ ఏడాదిలో జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో జరగ వలసిన పరీక్షలను తెలంగాణ సర్కార్ మొదలు పెట్టింది.టెట్ , బీఈడీ పరీక్షలను నిర్వహించారు..అంతేకాదు వాటి పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేసింది.. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష ల ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాల లో అందుబాటులో ఉన్న సీట్ల లెక్కింపును మొదలు పెట్టారు.



ఈ మేరకు తెలంగాణలో కూడా సీట్ల లెక్కింపును పూర్తి చేశారు..రాష్ట్రంలో భర్తీ అయిన ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ అధికారులు శనివారం వెల్లడించారు. తొలి విడుత 71.49 శాతం ఇంజినీరింగ్‌  సీట్లు భర్తీ అయినట్లు విద్యా శాఖ వెల్లడించింది. రాష్ట్రం మొత్తం మీద 19,998 సీట్లు మిగిలాయని కౌన్సిలింగ్ అధికారులు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలో ఉన్న  మొత్తం సీట్లను పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు..



ఇక మొత్తం మీద ఉన్న 164 కాలేజీల్లో ఉన్న 47,046 బీటెక్‌ సీట్లు కేటాయించారు. 13 యూనివర్సిటీలు, 35 ప్రైవేట్‌ కళాశాలల్లో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. మూడు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. ఇంజినీరింగ్ కళాశాల లో ఉన్న అన్నీ కోర్స్ లు పూర్తి అయినట్లు తెలిపారు.బీఫార్మసీ, ఎంపీసీ కోటాలో కేవలం 4.02 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,324 సీట్లు మిగిలాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు వచ్చిన విద్యార్థులు అక్టోబర్ 28 న సీట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు లేదో చెప్పాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ సూచించారు. ఈ నెల 29 నుంచి తుది విడత ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు నవీన్ తెలిపారు. రానున్న రెండు నెలల్లో అన్నీ పరీక్షలను పూర్తి చేసి , ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఆయ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కాలేజీలను విరామం లేకుండా కొనసాగించాలని ఆలోచనలో ఉన్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: