కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా తగ్గిందని తెలుస్తుంది ఈ మేరకు అన్నీ సంస్థలు యదా విధిగా కొనసాగుతున్నాయి.  ఇప్పుడు తెలంగాణ లో మాత్రం వరుసగ అన్నీ పరీక్షలను జరిపిస్తున్నారు. వాటి రిజల్ట్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఈమేరకు ఇంటర్ చదివిన విద్యార్థులకు చెప్పారు తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదువుతూ.. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపిక కావాలని భావిస్తున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. సంబంధిత ఉద్యోగానికి నిర్వహించే రాత పరీక్ష కోసం ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.. వాటితో పాటుగా ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది..



తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 402 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఉన్న 20 కళాశాలల్లో మొదట ట్రైల్ కోసం తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు.పోలీసు పరీక్షలకు ఎంపిక చేసేందుకు పిజికల్ ఫిట్ నెస్ తో పాటుగా , రాత పరీక్ష లో కూడా ప్రతిభను చూపాలని తెలిపారు. ప్రతి ఏటా తెలంగాణ లో పోలీస్ కానిస్టేబుల్ కోసం నోటిఫికేషన్ పడిన ప్రతి సారి ప్రవేట్ సెంటర్లో కోర్స్ లు తీసుకుంటున్నారు.. అలాంటిది ఈ ఏడాదిలో  అవసరం లేదని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు..



సర్కార్ కాలేజీల్లో ఉన్న విద్యార్థులకు విద్యతో పాటుగా , ఉద్యోగం , ఉపాధిని కూడా అందించే దిశగా ప్రభుత్వం కొనసాగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఒక్కో కాలేజీలో 100 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి ఈ శిక్షణ ఇస్తారు. కాలేజీలను పూర్తిగా తెరిచిన తర్వాత ఈ విషయం పై మరోసారి చర్చలు జరిపి అనంతరం తరగతులను ప్రారంభిస్తామని తెలిపారు. పోలీసు అధికారుల సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. త్వరలో పోలీసు శాఖ 20 వేల పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు ఇటీవల హోం మంత్రి మహమూద్‌ అలీ ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: