గేట్-2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీ-ముంబై మరో కీలక అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేసుంటే సరి చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో అభ్యర్థులు పరీక్ష రాసే సిటీ, కేటగిరీ, జెండర్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. పరీక్ష కేంద్రాన్ని ఉచితంగానే మార్చుకునే అవకాశం కల్పించారు. కేటగిరీ, జెండర్, పేపర్ మార్చుకోవడానికి ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కరెక్షన్ అవకాశం అక్టోబర్‌ 28 నుంచి నవంబర్ 13 వరకు ఉంటుంది. అయితే ఓకసారి మాత్రమే అభ్యర్థులు తమ వివరాలను మార్చుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలను https://www.gate.iitb.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఇక వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న గేట్‌-2021 పరీక్షలో ఐఐటీ బాంబే కొన్ని మార్పు‌లు చేసింది. కొత్త పేపర్లను చేర్చింది.. అర్హతల్లో మార్పులు చేసింది. ఇంకా ఇలాంటి అనేక ఆసక్తికరమైన మార్పులతో గేట్‌-2021 ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంజినీరింగ్, సైన్స్‌ విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించటానికి ప్రధానంగా ఉద్దేశించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ఇప్పుడు ఆర్ట్స్, కామర్స్‌ విద్యార్థులనూ తన పరిధిలోకి తెచ్చుకుంది. గేట్‌-2021 పరీక్షలు ఆరు రోజులపాటు (2021- ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు.. 12 నుంచి 14 వరకు) జరగనున్నాయి. గతంలో ఈ పరీక్ష‌ రెండు విడతలుగా నాలుగు రోజుల పాటు జరిగేది. ప్రస్తుతం కరోనా విపత్తు కారణంగా వ్యక్తిగత దూరం పాటించాల్సిరావటం, మూడో సంవత్సరం విద్యార్థులు కూడా రాయబోతున్నందున.. ఈసారి ఆరు రోజులపాటు నిర్వహిస్తున్నారు.


విద్యార్హత:

గేట్‌-2021కి సంబంధించి విద్యార్హతలో కూడా మార్పులు జరిగాయి. ఇంజినీరింగ్‌/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌/సైన్స్‌/కామర్స్‌/ఆర్ట్స్‌ విభాగాల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చదివినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు. అంటే ప్రస్తుతం ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాయవచ్చు. దీంతో మరింత ఎక్కువ మంది పరీక్ష రాసే అవకాశం లభించినట్లయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: