ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కరోనా వ్యాప్తి తగ్గినా కూడా గతంలో ఏర్పడి ప్రభావాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. అయితే మిగిలిన వాటిని అంటే వాణిజ్య , వ్యాపారాలను కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యా సంస్థలను ఇటీవల తెరిచిన సర్కార్ కు వరుస దెబ్బ ఎదురవుతున్నాయి.. నవంబర్ 2 నుంచి ఏపి వ్యాప్తంగా పై తరగతులను పునః ప్రారంభం అయ్యాయి.. అయితే క్లాసులకు విద్యార్థుల హాజరు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నారు.



ఇక కరోనా మహమ్మారి కోరలు చాచుతున్న నేపథ్యం లో పాఠశాల యాజమాన్యం విద్యార్థుల బాధ్యతను చేపట్టాలని కోరారు.. ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేస్తూ , అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే విద్యార్థులకు కూడా కరోనా సోకుతుంది. ఆందోళనకరం గా కరోనా వ్యాపిస్తుంది. పలు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్నం వరకు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. దాంతో పిల్లల తల్లి దండ్రులు స్కూల్స్ కు పంపించాలంటే భయ పడుతున్నారు.



జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కారంచేడు ఎంపీయూపీ స్కూల్‌లో ఓ టీచర్‌కు, తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌ లో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఇక టంగుటూరు మండలం మర్లపాడు జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి, అర్థవీడు మండలం పాపినేని పాలెం జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల కు కరోనా వచ్చినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మళ్లీ స్కూల్స్ మూతప డే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. మళ్లీ స్కూల్స్ , కాలేజీలు మూత పడితే ఇంక విద్యార్థుల భవిష్యత్ గురించి మర్చి పోవాలని ప్రముఖులు అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: