తెలంగాణ ఎంబీబీఎస్ , దంత వైద్య విద్యకు సంబందించిన కోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ ఇటీవల రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే.. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకు ఫీజులు తగ్గిస్తూ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జీఓ నెంబర్ 146ను జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్ కాలేజీల్లో ,అలాగే మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.



ఈ ఏడాది నుంచి 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపారు..ప్రైవేట్ వైద్య కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేట్ కాలేజీ అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంసెట్ , నీట్ కౌన్సిలింగ్ లు అయిపోయి కూడా చాలా కాలం అయ్యింది. అయిన తెలంగాణ సర్కార్ మాత్రం సీట్ల కేటాయింపులో జాప్యం చేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి నిర్వహించనున్న కౌన్సెలింగ్‌కు బ్రేక్‌ పడింది. డిసెంబరు 15 నుంచి తరగతులు ప్రారంభించాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, కౌన్సెలింగ్‌ను నిలిపివేయడం గమనార్హం.



ఈ నెల 8వ తేదీ లోపు అన్నీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ  పూర్తయినా.. ఇప్పటికీ నోటిఫికేషన్‌ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కాగా, కౌన్సెలింగ్‌ నిలిచిపోవడానికి నిరుడు సీట్ల కేటాయింపులో జరిగిన తప్పులే కారణంగా తెలుస్తోంది. సీట్ల కేటాయింపులో జరిగిన పొరపాట్లను ఆధారాలతో సహా పలువురు మంత్రి ఈటల, హెల్త్‌ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ విషయం ఇప్పటిలో ముందుకు కదలదని తెలుస్తుంది.. మరి సర్కార్ ఎప్పటికీ ఈ ప్రక్రియను పూర్తి చేస్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: