మహిళలను శారీరకంగా,మానసికంగా దృఢంగా తయారు చేసేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారు.. ఈ నేపథ్యంలో వారి కోసం కొత్త పథకాలను అందిస్తున్నారు. ముఖ్యంగా చదువుకొనే అమ్మాయిలకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తున్నారు..చదువుకోవటంలో మంచి తెలివి తేటలు కలిగి ఉండి , డబ్బులు లేని పేద విద్యార్థులకు భారత ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. 



అమ్మాయిలకు ఆర్థికంగా అండగా నిలవడానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి డిప్లొమా, ఇంజినీరింగ్‌ చదువుతున్న అమ్మాయిల కోసం స్కాలర్‌షిప్‌లు ఏర్పాటుచేసింది. ప్రగతి స్కాలర్‌షిప్‌ల పేరిట ప్రతి ఏడాది పదివేల మందికి వీటిని అందజేస్తోంది.ఈ లబ్దిని పొందాలంటే వారికి ఉండవలసిన అర్హతలను చూస్తే..డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌, అలాగే లేటరల్‌ ఎంట్రీలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు ప్రగతి స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు..డిప్లొమా కు సంబందించిన 5000 వేల మందికి,ఇంజనీరింగ్ స్థాయిలో ఉన్న 5000 మందికి ఈ అవకాశాన్ని అందిస్తున్నారు. 



డిప్లొమా అభ్యర్థులైతే పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు. పదో తరగతికి డిప్లొమాలో చేరడానికి మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్‌ ఉండకూడదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కాలర్ షిప్ ల విషయానికొస్తే..ఏపీలో డిప్లొమా చదువుతున్న విద్యార్థినుల్లో 318 మందికి, తెలంగాణలో 206 మందికి వీటిని అందిస్తారు. అలాగే ఇంజినీరింగ్‌ విభాగంలో ఏపీ నుంచి 566 మందికి, తెలంగాణ నుంచి 424 మందికి ఇవి అందజేస్తారు.ఎస్సీ, ఎస్టీ, బీసి కులంలోని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక కోటా కింద అర్హతను కల్పించనుంది..స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే ఏడాదికి రూ.50 వేల చొప్పున డిప్లొమా వాళ్లకు మూడేళ్లు.. ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతున్న వారికైతే నాలుగేళ్లు చెల్లిస్తారు. లేటరల్‌ ఎంట్రీలో చేరినవారికి డిప్లొమా అయితే రెండేళ్లు, ఇంజినీరింగ్‌ అయితే మూడేళ్లపాటు ఇవి అందజేస్తారు...ఈ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ డిసెంబర్ 31..మరిన్ని వివరాల కోసం కింద తెలిపిన వెబ్ సైట్ ను వీక్షించ వచ్చు.. https://scholarships.gov.in/ 


మరింత సమాచారం తెలుసుకోండి: