దేశ వ్యాప్తంగా కరోనా తర్వాత అన్నీ పాఠశాలలు, కాలేజీలు తెరుచుకున్నాయి. వచ్చే ఏడాదికి సంబంధించి పీజీ ప్రవేశ కోర్సులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు..ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం తరగతులను కూడా ప్రారంభించారు. ఇకపోతే కానిస్టేబుల్, సైనిక్ స్కూల్ ప్రవేశాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు..ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ -2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీని పొడిగించారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.



కాగా , ఈ దరఖాస్తు ను తేదీని పొడిగి స్తునట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది.. దాంతో పాటుగా పరీక్షను కూడా వాయిదా వేశారు.2021 ఫిబ్రవరి 7 న పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ద్వారా ఆరో తరగతి, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.. ఈ పరీక్ష ద్వారా ఐదో తరగతి చదివే విద్యార్థులు ఆరో తరగతి కి .. అలాగే ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నారు.  దేశ రక్షణ పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించడంతో దేశం అభివృద్ది చెందుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. 



సైనిక పాఠశాలలో చేరాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చునని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు..ఈ దరఖాస్తుల కోసం https://aissee.nta.nic.in/ ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..https://aissee.nta.nic.in/ ఈ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులో ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దు కోవచ్చునని వెల్లడించారు. డిసెంబర్ మూడో వారం వరకు ఈ వెబ్ సైట్ లో సరి చేసుకోవచ్చును.. రిజర్వేషన్‌ లేని విద్యార్థులు రూ.550, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.400 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. పైన తెలిపిన వెబ్ సైట్ లోకి వెళ్లి ఫామ్ ను ఫిల్ చేయాలి. ఫోటోలను , ఆన్ లైన్ చెల్లింపులు చేయడం వంటి వాటి వల్ల దరఖాస్తులు దాకలు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: