కరోనా ప్రభావం కారణంగా మొన్నటి వరకు స్కూల్స్, కాలేజీలు మూత పడిన విషయం తెలిసిందే.. ఇప్పుడు దేశంలోని రాష్ట్రాల్లో మళ్లీ స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు ఉన్న దృష్ట్యా తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెలలో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా దాదాపు 80శాతం మంది పాఠశాలలు నిర్వహించేందుకు అంగీకరించారు. తరగతి గదిలో 25 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేయాలని సర్కారు ఆదేశించింది..



ఈ మేరకు అన్ని చర్చలు జరిగిన తర్వాత ఈ నెల 19 నుంచి పాఠశాలలను మళ్లీ పునః ప్రారంభం చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. జేఈఈ, క్యాట్‌, ఎన్‌ఐటీ సహా అన్ని పోటీపరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, విద్యార్థులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నిబంధనలు అమలు చేయాలని, జిల్లాల వారీగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని చెప్పారు.. గత నెలలో పాఠశాలల పునః ప్రారంభం పై చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 



తమిళనాడు మద్రాస్ ఐఐటీలో సరైన నిబంధనలు పాటించని కారణంగానే విద్యార్థులకు కరోనా సోకిందని పలువురు చెబుతున్నారు. బస్సుల్లో విద్యార్థుల ప్రయాణానికి కూడా తగిన మార్గదర్శకాలతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. కరోనా విషయంలో ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలు జాగ్రత్తలు పాటిస్తూన్నాయి.. గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం పాటించలేదు అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పటి వరకు నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులకు ఏ మేరకు పాఠ్యాంశాలు అర్థమయ్యాయో తెలియని పరిస్థితి ఉందని? ఇప్పుడు తరగతులు ప్రారంభించి రెండు నెలల్లో పోటీ పరీక్షలంటే విద్యార్థులను ఒత్తిడికి గురిచేయడమేనని, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం పాఠశాలలకు ఉందని సదరు అభిప్రాయపడుతున్నారు.. ఏపి, తెలంగాణలో స్కూల్స్ ను ఫిబ్రవరి లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు అన్నీ నిర్ణయాలను తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: