ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా వల్ల తినడానికి తిండి కూడా లేకపోవడంతో చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోయారు.ఇప్పుడు ఆయా ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించేందుకు ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. పలు ఉద్యోగాలలో ఖాళీలు కూడా వెల్లడించారు. తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.



హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్, జూనియర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులున్నాయి. హైదరాబాద్‌తో పాటు రోహ్‌తక్ ప్లాంట్లలో ఈ ఖాళీలున్నాయని ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యా అర్హతలు ఉన్న వాళ్ళే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు..

జూనియర్ టెక్నీషియన్ - 1

ఆపరేటర్ ఫ్లూడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సీఎన్‌టీ- 1

ఆపరేటర్ సీఎన్‌సీ ఫైబర్ కటింగ్ మెషీన్- 1

ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బాలిస్టిక్ ప్యానెల్ మౌల్డింగ్- 1


ఆపరేటర్ ఆటోక్లేవ్- 1జూనియర్ ఆర్టిసన్ వెల్డర్- 1
జూనియర్ స్టాఫ్ నర్స్- 3


దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ.. జనవరి 9 తేదీ..

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 23

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు

ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.

వేతనం- ఏడాదికి రూ.3,90,000 నుంచి రూ.4,50,000

అప్లై చేసుకొనే విధానం..

ముందుగా https://midhani-india.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, అందులో కెరీర్ ను ఎంపిక చేయాలి..అందులో ఇ- రిక్వైర్మెంట్స్ పైన క్లిక్ చేయాలి.తర్వాత మిధానీ పోస్ట్ పై క్లిక్ చేయాలి..అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని దాచి పెట్టుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: