విద్యార్థులకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కరోనా వల్ల ఉద్యోగాలు పోయిన నిరుద్యోగులకు ఓ ప్రముఖ కంపెనీ చక్కని అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ మేరకు క్యాప్ జెమిని ఈ ఏడాది భారత్‌లో భారీగా ఉద్యోగులను నియమించుకోనుంది తెలుస్తుంది. 2021లో భారత దేశంలో సుమారు 30,000 మందిని ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు క్యాప్‌ జెమిని సీఈవో అశ్విన్ యార్డి తాజాగా వెల్లడించారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, 5జీ, సైబర్‌ సెక్యూరిటీ, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డి లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాలలో తాజా నియమాకలను చేపడతామన్నారు. పోయిన ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది డిజిటల్‌ సొల్యూషన్‌కు పెరిగి భారీ డిమాండ్‌ తమవ్యాపార అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. డిసెంబర్ మూడో నెలలో క్యాప్‌ జెమిని ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్‌ బిజినెస్‌, డిజిటల్ సొల్యూషన్స్‌దే కావడం గమనార్హం. కరోనానుంచి కోటుకుంటున్న సమయంలో వ్యాపారి తిరిగి పుంజుకుంటుందని, భారీ డీల్స్‌ సాధిస్తామనే అంచనాలతో భవిష్యత్తు మరిన్ని నియామకాలు చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు చెప్పారు.


ఇకపోతే గత ఏడాది ఏప్రిల్ లో, మహమ్మారి పీక్‌ సమయంలో కూడా తాము వేతన పెంపునుP ప్రకటించామని వెల్లడించారు. దేశీయంగా మొత్తం 125,000 మంది ఉద్యోగులతో ఉన్నగత ఏడాది భారతదేశంలో దాదాపు 24 వేల నియామకాలను చేపట్టింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు భారగా పుంజుకున్నాయి. ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమింకోగా, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్, 2021లో దాదాపు 23,000 మందిని నియమించుకోవాలని ఆశిస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువ.. క్యాప్ జెమిని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా యువత జీవితాల్లో వెలుగులు నింపుతుంది.ఆసక్తి కలిగిన విద్యార్థులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: