నిరుద్యోగుల కోసం కేంద్రం మరొక శుభవార్త ను తీసుకు వచ్చింది.. ముఖ్యంగా ఎంతో మంది ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు లేక నిరాశ్రయులైన వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు.. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ఉద్యోగాల ఖాళీలను త్వరలో భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా 6552 ఉద్యోగాల భర్తీకి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) నిరుద్యోగులకు పిలుపునిస్తోంది..


దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఈ ఎస్ ఐ సీ సంస్థలు ఉన్నాయో అక్కడ మొత్తం 6552 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు  ఈ ఎస్ ఐ సీ   అధికారులు తెలిపారు. . అయితే త్వరలోనే వీటి భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలనుకుంటోంది. ఇక అనుకున్నదే తడవుగా ఈ నెల ఆఖరి లోపు కానీ ,  వచ్చే నెలలో గాని ఈ పోస్టులకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని ఈ ఎస్ ఐ సీ అధికారులు వెల్లడించారు.


మొత్తం ఖాళీలు:
6552 పోస్టులు
విభాగాల వారీగా :
అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులు  - 6306,
స్టేనో గ్రాఫర్ పోస్టులు  - 246 పోస్టులు ఖాళీ గా  ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

విద్యార్హతలు:
1.అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాషియర్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
2.స్టేనో గ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

వయోపరిమితి :
18 నుంచి 27 సంవత్సరాల లోపు వారై ఉండాలి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా మొదట ఎంపిక చేస్తారు. ఆ తరువాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో పది నిమిషాలలో, నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి.


 పైన ఇచ్చిన అన్ని అర్హతలు మీ లో ఉన్నట్టు అయితే వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎస్ ఐ సి అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటును కల్పించింది కేంద్రం..

మరింత సమాచారం తెలుసుకోండి: