చాలా మందికి ఇంటర్ చదివాము ఏం జాబులు వస్తాయిలే అనుకుంటారు.. అలా నిరాశకు గురి కాకండి..ప్రభుత్వ సంస్థలు మీకు గుడ్ న్యూస్ చెప్పాయి..ఇండియన్ నేవీ సెయిలర్‌ విభాగంలో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 2021 ఏప్రిల్ 26న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 30 లోగా అప్లై చేయాలి. పెళ్లికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టుల్ని భర్తీ చేయనుందో ఇండియన్ నేవీ ప్రకటించలేదు. 


కానీ గత ఏడాది నోటిఫికేషన్ తో పోలిస్తే 2700 భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది..అందులో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ పోస్టులు 2200, ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టులు 500 ఉన్నాయి.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్‌ను ఉంటుంది. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.. 


ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 26

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30

భర్తీ చేసే పోస్టులు- సీనియర్ సెకండరీ రిక్రూట్స్, ఆర్టిఫిషర్ అప్రెంటీస్

విద్యార్హతలు- సీనియర్ సెకండరీ రిక్రూట్స్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా ఓ సబ్జెక్ట్‌తో ఇంటర్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా ఓ సబ్జెక్ట్‌తో ఇంటర్ పాస్ కావాలి.

దరఖాస్తు ఫీజు- రూ.215. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు

ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్

వేతనం- శిక్షణా కాలంలో నెలకు రూ.14,600 స్టైపెండ్ లభిస్తుంది. ఆ తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ 3 వేతనం లభిస్తుంది.

ఆసక్తి కలిగిన వాళ్ళు పైన తెలిపిన లింక్ ను ఓపెన్ చేసి పూర్తి వివరాలను ఒకసారి చదివి అప్లై చేసుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: