ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది.. ఈ మేరకు ప్రైవేట్ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి గ్యారంటీ లేకుండా పోయింది.. ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది. లాక్ డౌన్ కారణంగా ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి.కానీ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు మాత్రం ఆగడం లేదు.. వరుస నోటిఫికేషన్ లు విడుదల చేస్తున్నారు.. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఖాళీలను భర్తీ చేశాయి. తాజాగా మరో కంపెనీ కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. 


తాజాగా దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన ఆయిల్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు అసోంలోని డిబ్రూగఢ్‌లో పనిచేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు, నిరుద్యోగులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


గ్యాస్ లాగర్ విభాగంలో 20, అసిస్టెంట్ మెకానిక్ విభాగంలో 79, డ్రిల్లింగ్ టాప్ మ్యాన్ విభాగంలో 17, కెమికల్ అసిస్టెంట్ విభాగంలో 10, అసిస్టెంట్ రిగ్ ఎలక్ట్రీషియన్ 10, ఎలక్ట్రిక్ సూపర్ వైజర్ 5, డ్రిల్లింగ్ రిగ్ మ్యాన్ విభాగంలో 5, డ్రిల్లింగ్ హెడ్ మ్యాన్ విభాగంలో 4 చొప్పున ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వేర్వేరు పోస్టులకు విద్యార్థులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి ..టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.కెమికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థులు మే 22లోగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: