కరోనా మహమ్మారి మృత్యు గంట మోగిస్తున్న సంగతి తెలిసిందే..ఇలాంటి క్రమంలో చాలా కంపెనీలు నిరుద్యోగులను ఆదుకునేందుకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సైతం 50 వేల మంది వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే.


తాజాగా ప్రతిష్ట్మాత్మక ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భువనేశ్వర్ సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ aiimsbhubaneswar.nic.in ద్వారా ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన అప్లికేషన్స్ ను ఈ నెల 18 నుంచి స్వీకరించనున్నారు. ఆఖరి తేదీ జూన్ 5 గా పేర్కొన్నారు.

ఉద్యోగాల అర్హతలు :

ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి. ఎంసీఐ(MCI) తో గుర్తింపు పొంది ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గరిష్ట వయస్సు 45 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు.

ఈ  పరీక్షల ఎంపిక విధానం ..

రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పోస్టుల కన్నా ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య మూడు రెట్లు ఉంటేనే రాత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తులు పోస్టుల సంఖ్య కన్నా తక్కువగా వస్తే రాత పరీక్ష ఉండదని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు అభ్యర్థులు నోటిఫికేషన్ లో చూడవచ్చు.


ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన అభ్యర్థులు రూ.1500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1200 చెల్లిస్తే సరిపోతుంది. ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: