సాంకేతిక విప్లవం తో పరీక్షా విధానంలో కూడా అనేక మార్పులు వచ్చేశాయి. ఒకప్పటి పేపర్, పెన్ను ఇప్పుడు అవసరం లేకుండానే కేవలం కంప్యూటర్ ద్వారా ఆన్ లైన్ పరీక్షా విధానం అమలులోకి వచ్చేసింది. అయితే ప్రతి దానిలో లోపాలు ఉన్నట్టే ఇక్కడ కూడా లోపాలు లేకపోలేదు. ఆయా విధానాలలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకొని కొందరు గడుగ్గాయిలు పరీక్షలలో సినిమా లలో చూపిన విధంగా కాపీలు కొట్టడానికి కొత్త విధానాలు కనిపెడుతున్నారు. ఇంతపెద్ద దేశంలో పరీక్షలు అంటే పోటీతత్వం అవసరం, కానీ అది తప్పుడు మార్గంలో ఉంటేనే కష్టం. పోటీ ఉంది కదా అని దానిని తట్టుకోడానికి కొత్త కొత్త ప్రణాళికలు రచించి మరి తప్పుడు మార్గాలు అనుసరించాల్సిన అవసరం ఏమిటి. కేవలం నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోటీలో ఇతరులను పక్కకు నెట్టేయాలి. అంతే కానీ కాపీలు కొట్టి పాసైతే మాత్రం మనసుకు తృప్తి లభిస్తుందా, ఆ విజయం రుచే తెలియదు.

తాజగా రాజస్థాన్ లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పరీక్ష నిర్వహించారు. దానికి కాపీ కొట్టిన పద్దతి అందరిని ఆశ్చర్యపరిచింది. అందులో ఒక అభ్యర్థి చెప్పులతో బ్లూటూత్ ఉంచుకొని కాపీకి సిద్ధం అయ్యాడు. ఈ నియామకం కోసం 31వేల ఉగ్యోగలకు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నెలలోనే 26న దానికి పోటీ పరీక్ష నిర్వహించారు. అయితే ప్రభుత్వం ముందస్తు జాగర్తతో నెట్ సేవలు నిలిపివేసి పరీక్ష నిర్వహించడం ప్రారంభించింది. దీనికోసం అధికారులు 12 గంటల పాటు నెట్ నిలిపివేశారు.

ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని నిరోధక ప్రయత్నాలు చేసినా అభ్యర్థులు కొత్తకొత్త విధానాలు వారిని అనుక్షణం ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఈ తెలివి తేటలు ఏవో జ్ఞాన సముపార్జన లో చూపిస్తే భారత్ లో ఎందరో వైజ్ఞానికులు తయారయ్యే అవకాశం ఉంది. పరీక్ష ముందు అధికారులు తనిఖీలు  నిర్వహించగా కొందరు చెవిలో, ఇంకొందరు చెప్పుల్లో బ్లూటూత్ పెట్టుకొచ్చినట్టు కనిపెట్టారు.   దీనివెనుక భారీ ఎత్తున ప్రణాళిక ఉన్నట్టు అధికారులు కనుక్కున్నారు. ఆ ముఠా వివరాలు  తెలుసుకొని వాళ్లే ఆశ్చర్యపోయారు. వీరంతా ముందస్తు ప్రణాళికతో ముఠాలుగా ఏర్పడి ఈ మాస్ కాపీ కి సిద్ధమైనట్టు అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తే తెలిసిందని, దానితో పరీక్షకు ముందే వారిని నిలువరించగలిగినట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: