కేంద్రం చర్యలపై మరోసారి ఉన్నత న్యాయస్థానం చురకలు పెట్టింది. చివరి నిముషంలో నీట్ పరీక్షలో మార్పులు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఉన్నతన్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటివి ఉంటె ముందే చేసి విద్యార్థులకు అవి అందుబాటులో ఉంచితే అది పద్దతిగా ఉంటుంది. కానీ మీ ఇష్టానికి మార్పులు చేసి సమయం సందర్భం లేకుండా వాటిని విద్యార్థుల మీద రుద్దటం విద్యాశాఖకు తగినపనికాదు. దానికి కేంద్రం కూడా సరే అనడం కూడా సరైన పని కాదు. మీరు మార్పులు చేసిన వెంటనే అవి విద్యార్థులు చదివేసుకొని పరీక్షకు సిద్ధం అయిపోవాలా.. అది సాధ్యమనే భావిస్తున్నారా..అనేవిధంగా ఉన్నత న్యాయస్థానం కేంద్రం చేసిన పనిని విమర్శించింది.

విద్యార్థులు ఇప్పటికే ఒత్తిడితో ఉంటె వారిపై ఇష్టానికి కొత్త మార్పులు అంటూ చడీచప్పుడు లేకుండా చేసుకుంటూ పోతే వాళ్ళూ మనుషులే, కాస్త సమయం ఎవరికైన అవసరం అవుతుంది అనే కనీస జ్ఞానం ఉండాలి. ఇష్టానికి తన్నేదానికి వాళ్ళేమి ఫుట్ బాల్ కాదని గుర్తుంచుకోవాలని కేంద్రానికి స్పష్టం చేసింది. చేసిన మార్పులను కోర్టు సమీక్షిస్తుంది, అవి తృప్తికరంగా లేకపోతే వాటికి ఆమోదించబోమని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

విద్యార్థుల భవితవ్యాన్ని ఎవరో అధికారుల చేతిలో పెట్టేసి ఊరుకోవడం నా వ్యవస్థకు సాధ్యం కాదని న్యాయస్థానం చెప్పింది. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నేషనల్ మెడికల్ కమిషన్ మరియు నేషనల్ బోర్డు అఫ్ ఎగ్జామ్స్ మార్పులు చేయాలి అనుకుంటే దానిని తగిన విధానాలు ఉంటాయని, వాటిని అనుసరించడం అలవాటు చేసుకోవాలని సూచించింది. నీట్ వైద్యవిద్యాబ్యాసం కోసం ప్రవేశ పరీక్ష. ఎంబీబీఎస్, బీడీఎస్ చేయాలనుకునే వారు దీని ద్వారా దేశంలోని పలు వైద్య కళాశాలలలో సీటు పొందుతారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యకళాశాలలలో దీనిద్వారానే ప్రవేశాలు జరుగుతాయి. గతంలో దీనినే ఆయా కళాశాలలు నిర్వహించుకునేవి. ఇప్పుడు దానిని మార్చి అన్నిటికి ఒకే విధానం తెచ్చింది భారత ప్రభుత్వం. నీట్ ను ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: