హిందువుల అత్యంత ప్రియమైన, పూజ్యమైన దేవతలలో లార్డ్ గణేశుడు ఒకరన్న విషయం తెలిసిందే. గణేష్ ని ఆయన భక్తులు వివిధ పేర్లతో పిలుస్తారు. పార్వతీ, పరమ శివుని పుత్రుడైన గణేశుని పూజించకుండా ఏ శుభ కార్యమూ పూర్తి కాదు. మీరు కూడా వినాయకుడికి అపారమైన భక్తులైతే జీవితంలో మీరు ఒక్కసారైనా వెళ్ళవలసిన కొన్ని ప్రసిద్ధ గణేష్ దేవాలయాల గురించి తెలుసుకోండి.

కాణిపాకం వినాయక దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ పురాతన దేవాలయం చాలా ప్రత్యేకమైనది. భక్తులకు పూజనీయమైనది. వినాయకుని ప్రత్యేకమైన కాణిపాకం వినాయక ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజు చోళుడు I ప్రజల మధ్య వివాదాలను పరిష్కరించి చెడును అంతం చేయడానికి నిర్మించాడు.

మహారాష్ట్రలోని ముంబయిలో ఉన్న సిద్దివినాయక దేవాలయం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆలయాన్ని ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని లక్ష్మణ్ విత్తు, దేవబాయి పాటిల్ 1801లో నిర్మించారు. ఈ ఆలయంపై భక్తులకు అచంచలమైన విశ్వాసం.

కేరళలోని కాసర్‌గోడ్‌లో మధువాహిని నది ఒడ్డున ఉన్న మధుర మహాగణపతి ఆలయం భారతదేశంలోని మరొక ప్రసిద్ధ గణేష్ దేవాలయం. ఎల్లప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని 10వ శతాబ్దంలో కుంబ్లాలోని మాయపడి రాజులు నిర్మించారు.

జైపూర్‌లోని ఒక చిన్న కొండపై ఉన్న మోతీ డుంగ్రీ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. గణేశుడికి అంకితం చేసిన మోతీ డుంగ్రి గణేష్ ఆలయం 1761లో సేథ్ జై రామ్ పల్లివాల్ పర్యవేక్షణలో నిర్మించబడింది. ఎంతో అందంగా ఉండే ఈ ఆలయానికి స్వామిని దర్శించుకోవడానికి ప్రతి రోజూ లెక్కలేనన్ని మంది భక్తులు వస్తుంటారు. మోతీ డుంగ్రీ ఆలయం భారతదేశంలోని అతి పెద్ద గణేష్ దేవాలయాలలో ఒకటి.

మనకుల వినాయగర్ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గణేష్ దేవాలయాలలో ఒకటి, ఇది 1666 సంవత్సరాల నాటి ఫ్రెంచ్ ప్రాంతం పాండిచ్చేరిలో నిర్మించబడింది. ఈ దేవాలయంలోని గణేష్ విగ్రహం అనేక సార్లు సముద్రంలో పడేశారని, అయితే అది ప్రతిరోజూ అదే స్థలంలో మళ్లీ దర్శనమిస్తుందని చెబుతారు. అప్పటి నుండి ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. భక్తుల విశ్వాసానికి కేంద్రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: