కేంద్ర కార్మిక, ఉద్యోగ కల్పన మంత్రిత శాఖ ఆధ్వర్యంలో పని చేసే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అయిన “సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్” ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీ మూడు విధాలుగా జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే...

 Jobs

ఖాళీల వివరాలు : 
మొత్తం ఖాళీలు: 2,189.
తెలంగాణలో మొత్తం ఖాళీలు: 151 (ఎస్సీ 28, ఓబీసీ 53, ఈడబ్ల్యూఎస్ 16, అన్‌రిజర్వ్‌డ్ పోస్టులు 54).
ఆంధ్రప్రదేశ్: 60 (ఓబీసీ 24, ఈడబ్ల్యూఎస్ 5, అన్‌రిజర్వ్‌డ్ పోస్టుల సంఖ్య 31).

అర్హతలు..
విద్యార్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనలియర్ చదువుతూ ఫలితాల కోసం ఎదురుచూసే వార్కి ఈ నోటిఫికేషన్ వర్తించదు.డేటాఎంట్రీ వర్క్ చేసే విధంగా గంటకు 5,000 కీ డిప్రెషన్స్ చేయగలిగే వేగం ఉండాలి.

వయసు: జూలై 21, 2019 నాటికి 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల వయోసడలింపు ఉంది.

వేతనం: ఏడో పే కమిషన్ కింద గ్రేడ్ సి విభాగంలో నెలకు రూ.25,500 ప్రారంభ వేతనం అందుతుంది. దీనికి అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం : 
 పోస్టుల భర్తీకి మూడంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, కంప్యూటర్ స్కిల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు...సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఈపీఎఫ్‌వోలో

 ముఖ్య తేదీలు : దరఖాస్తు రుసుం: రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ఎక్స్‌సర్వీస్ అభ్యర్థులకు రూ.250

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2019, జూలై 21.

హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్ తేదీలు: ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 1 వరకు.

ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2019, ఆగస్టు 31, సెప్టెంబర్ 1

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.epfindia.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: