ముంబ‌యి ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గ్రేడ్ బీ వివిధ క్యాటగిరీష్లో  ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలిసిందిగా RBI ప్రకటించింది. మొత్తం 199 ఖాళీలున్నాయి. ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఆర్‌బీఐ. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ www.rbi.org.ఇన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు రుసుము చెల్లించి, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజున పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఆర్‌బీఐ.ఆఫీసర్ పోస్టులు మొత్తం 199  ఖాళీ ఉన్నాయి.

వివిధ  విభాగాల్లో వివరాలోకి వెళ్తే  డ్ బీ జనరల్- 156 , డిపార్ట్‌మెంట్ అండ్ పాలసీ రీసెర్చ్ డిపార్ట్‌మెంట్- 20 , స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్- 23 పోస్టులు విడుదల చేసింది. ఇక అర్హత విషయానికి వస్తే డిగ్రీ, మాస్టర్ డిగ్రీ (ఎకనామిక్స్/ఎకనామిక్స్ సంబంధిత విభాగాలు), మాస్టర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్),  పీహెచ్‌డ చేసినవారు అర్హులు.అర్హులైన వారి వయసు 01.09.2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి అని తెలియచేసింది.దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది .

అక్టోబర్ 11 , 2019  దరఖాస్తుకు చివరి తేదీ అంతలోపు   ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలిసిందిగా కోరుతుంది.ప‌రీక్ష కేంద్రాల విషయానికి వస్తే ప్రధాన నగరాలలో  హైదరాబాద్, విజయ‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, తిరుప‌తి, రాజమ‌హేంద్ర‌వ‌రం, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, చీరాల‌,విజ‌య‌న‌గ‌రం నగరంలో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

మొదటి దశ పరీక్ష జనరల్ DEPR / DSIM  నవంబర్ 9 న ప్రారంభమం అవుతుంది. రెండో దశ పరీక్ష జనరల్  డిసెంబర్ 1 న ఉంటుంది మరియు DEPR / DSIM పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్- 2019 డిసెంబర్ 2 జరుగుతుంది అని  దరఖాస్తు తెలియచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: