రాత పరీక్ష లేకుండా కేవలం అకడెమిక్ మెరిట్ పై వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఒకటి. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కి చెందిన ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఈ ఉద్యోగాల పేరు ట్రేడ్ అప్రెంటిస్.. మొత్తం ఖాళీలు 161 ఉన్నాయి. బ్లాస్టర్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, వైర్‌మెన్ తదితరల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత పదోతరగతి తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 28.01.2020 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరితేది: ఫిబ్రవరి 15, 2020.మరిన్ని వివరాల కోసం https://hindustancopper.com/ వెబ్సైట్ చూడొచ్చు.
ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.