గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.. ఇది మహిళలకు శుభవార్త అనే చెప్పాలి..నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు, ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చాయి.10 గ్రాముల బంగారం ధరపై రూ.330 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండిపై రూ.600 వరకు పెరిగింది.వెండి వస్తువులు కొనాలని అనుకోనేవారికి మాత్రం భారీ షాక్ అనే చెప్పాలి... అంతర్జాతీయ మార్కెట్ లో నేడు ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..

ఈరోజు ప్రధాన నగరాల్లొ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,270 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,480 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,400, ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510 వద్ద ఉంది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 ఉంది..ఈరోజు బంగారం తగ్గితే వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి..కిలో వెండి ధరపై రూ.600 వరకు పెరిగింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.60,700 ఉండగా, ముంబైలో రూ.55,600 ఉండగా, ఢిల్లీలో రూ.55,600 ఉంది. కోల్‌కతాలో రూ.55,600 ఉండగా, బెంగళూరులో రూ.60,700 ఉంది. హైదరాబాద్‌లో రూ.60,700 ఉండగా, కేరళలో రూ.60,700 వద్ద ఉంది. ఇక విజయవాడలో రూ.60,700 ఉంది..రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: