బంగారం ధరలు ఈరోజు బ్రేకులు పడ్డాయి... మార్కెట్ లో ఈరోజు ధరలు భారీగా కిందకు దిగి వచ్చాయి..నిన్నటితో పోలిస్తే నేడు ధరలు ఉపశమనం కలిగిస్తున్నాయి..గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి రేటు ఈరోజు నేల చూపులు చూసింది. బంగారం కొనుగోలు చేయాలని చూసే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. గ్లోబల్ మార్కెట్లో మాత్రం పసిడి రేటు పైపైకి కదిలింది. మళ్లీ ర్యాలీ చేయడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో జూలై 22న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో బంగారం ధర తగ్గింది. రూ. 440 మేర క్షీణించింది. దీంతో బంగారం ధర రూ. 50,180కు దిగి వచ్చింది. 10 గ్రాములకు 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. ఇక ఆర్నమెంటల్ 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. రూ. 400 తగ్గింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 46 వేలకు క్షీణించింది. ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు నేడు స్థిరంగానే కొనసాగింది. కేజీకి రూ. 61 వేల వద్దనే కొనసాగుతోంది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర తగ్గింది. రూ. 440 క్షీణతో రూ. 50,180కు దిగివచ్చింది


బెంగళూరులో గోల్డ్ రేటు రూ. 420 పడిపోయింది. రూ. 50,250 వద్ద కదలాడుతోంది.చెన్నైలో కూడా పసిడి రేటు రూ. 420 తగ్గుదలతో రూ. 50,500కు దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు పరుగులు పెట్టాయి. గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన పసిడి రేటు ఈరోజు మాత్రం పైకి కదిలింది. 0.14 శాతం పెరిగింది. ఔన్స్‌కు పసిడి రేటు 1715 డాలర్లకు చేరింది. అలాగే వెండి రేటు కూడా పైకి కదిలింది. సిల్వర్ రేటు ఔన్స్‌కు 0.04 శాతం పైకి చేరింది. 18.72 డాలర్లకు ఎగసింది..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: