కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు చూడటమే మానేశాం.. ఎందుకంటే బంగారం ధరలు అంత భారీగా పెరిగిపోయాయి. నిజం చెప్పాలి అంటే ఈ బంగారం ధరలు సామాన్యులకు అందని ఎత్తుకు ఎదిగిపోయాయి. అలాంటి ఈ బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గిపోయాయి. ఎన్నో రోజుల పెరుగుదలకు నేడు బ్రేకులు పడ్డాయి.. అవి మాములు బ్రేకులు కాదు మహిళలు యెగిరి గంతేసే బ్రేకులు పడ్డాయి. 

 

వివిధ మార్కెట్లలో నేడు ఆదివారం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి.. హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,925 రూపాయిల తగ్గుదలతో 43,375 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1925 రూపాయిల తగ్గుదలతో 39,828 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా భారీగా తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర ఏకంగా 1,910 రూపాయిల తగ్గుదలతో 39,500 రూపాయిలకు చేరింది. ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలాగే భారీగా తగ్గాయి. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే? బంగారం ధర ఇప్పుడు ఎంత తగ్గిన ఎవరు కొనలేరు.. ఎందుకంటే కరోనా వైరస్ దేశమంతా లాక్ డౌన్ విధించారు.. దీని వల్ల మనం బయటకు వెళ్ళకూడదు.. అలాగే ఏ షాప్ లు తెరవకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: