బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి.. నిన్నటి వరుకు కరోనా వైరస్ కారణంగా అతి దారుణంగా పెరిగిన బంగారం ధర నేడు అమాంతంగా పతనం అయిపోయింది. దీంతో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయిల తగ్గుదలతో 43,800 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయిల తగ్గుదలతో 40,030 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర అతి దారుణంగా తగ్గింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 330 రూపాయిల తగ్గుదలతో 40,950 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు అతి దారుణంగా తగ్గిపోయాయి. ఇంకా మరింత తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే బంగారం, వెండి ధరలు ఎంత తగ్గినప్పటికీ ప్రస్తుతం కొనే అవకాశం అయితే ఎవరికి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: