అవును.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ లోను బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇన్నాళ్లు ఆకాశాన్ని తాకినా బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ భారీగా తగ్గుతున్నాయి.. కరోనా వైరస్ మహమ్మారి కారణం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఆ ధరలు అన్ని కూడా భారీగానే పతనం అవుతున్నాయి అనే చెప్పాలి. 

 

అయితే బంగారం ధరలు ఎంత పెరిగినప్పటికీ అప్పుడప్పుడు తగ్గుతూ ఉండేవి.. కానీ గత 15 రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.. అలాంటిది నిన్నటి నుండి బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. ఇంకా నిన్న పదహారు వందల రూపాయిలు భారీగా పతనం అవుతే.. ఈరోజు మరో నాలుగు వందల రూపాయిలు పతనం అయ్యాయి. ఇంకా ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎలా కొనసాగుతున్నాయి చూద్దాం.

 

నేడు బంగారం, వెండి ధరలు హైదరాబాద్ మార్కెట్ లో ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిల తగ్గుదలతో 44,200 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 500 రూపాయిల తగ్గుదలతో 40,100 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర భారీగా క్షిణించింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 500 రూపాయిల తగ్గుదలతో 41,150 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. అక్కడ కూడా తులం బంగారం ధరలు 40 వేల రూపాయిలు పడుతుంది. అయితే మే 3వ తేదీ వరుకు ఏ ప్రజలు కూడా బంగారు కొనుగోలు చెయ్యలేరు.. ఎందుకంటే కరోనా నియంత్రణకై కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగిస్తోంది కనుక! ఏమైతేనేం బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: